![]() |
![]() |

జబర్దస్త్ మాజీ కంటెస్టెంట్, బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఇటీవల గోవా ట్రిప్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. అరియానా గ్లోరీతో కలిసి అవినాష్ అక్కడ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ జంటతో పాటు శ్రీముఖి, విష్ణు ప్రియ, శ్రీముఖి తమ్ముడు సుప్రీత్, ఆర్జే చైతూ కూడా వెళ్లారు. అక్కడి బీచ్ సమీపంలో వున్న గోవా కోలా రిసార్ట్‌లో సందడి చేశారు.
పోర్ట్ ఏరియాకు బైకులపై వెళ్లిన ఈ జంటలు ఎక్కడి నుంచి బీచ్ వ్యూని చూసి ఎంజాయ్ చేశారు. అరియానాతో కలిసి అవినాష్ బైక్ రైడింగ్ వెళ్లాడు. మధ్యలో ఆపి అరియానా బైక్ రైడ్ చేసిన దృశ్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది. అవినాష్ వెనకాల కూర్చుని అరియానా రైడ్ చేస్తున్న దృశ్యాలని షూట్ చేశాడు.
ఆ తరువాత ఫోర్ట్ ఏరియాలో వున్న మర్రి చెట్టు ఊడల్ని పట్టుకుని కోతిలా ఊగుతూ ముక్కు అవినాష్ కోతి కొమ్మచ్చి ఆడిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. గోవా ట్రిప్‌కి సంబంధించిన వీడియోని అవినాష్ తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశాడు. అది నెట్టింట సందడి చేస్తోంది.
.jpg)
![]() |
![]() |